Share News

Nicholas Kirton: డ్రగ్స్‌ కేసులో కెనడా క్రికెట్‌ కెప్టెన్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:17 AM

కెనడా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ నికొలాస్‌ కిర్టన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. అతడి వద్ద 9 కిలోల మారిజువానా స్వాధీనం చేసుకున్నట్లు బార్బడోస్‌ పోలీసులు తెలిపారు

Nicholas Kirton: డ్రగ్స్‌ కేసులో కెనడా క్రికెట్‌ కెప్టెన్‌ అరెస్ట్‌

9 కిలోల మారిజువానా స్వాధీనం

బ్రిడ్జిటౌన్‌ (బార్బడోస్‌): కెనడా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ నికొలాస్‌ కిర్టన్‌ను డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..ఏకంగా తొమ్మిది కిలోల మారిజువానాను కిర్టన్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. 26 ఏళ్ల కిర్టన్‌ గత ఏడాది జూలైలో కెనడా జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. బార్బడో్‌సలో జన్మించిన నికొలాస్‌ దేశవాళీ అండర్‌-17, అండర్‌-19 పోటీలలో ఆ జట్టుకు ఆడాడు. అయితే అతడి తల్లి కెనడా వాసి కావడంతో అక్కడికి వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ఆడుతున్నాడు.


ఇవీ చదవండి:

ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు

రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్

ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2025 | 03:47 AM