Home » CBI Court
రెండు వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం, జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్-యూజీ, యూజీసీ-నెట్ ప్రవేశ పరీక్షల లీక్ ...
యజమానుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రత్యామ్నాయంగా వారికి రైల్వే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌పై సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. జూన్ 7వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్డడీ పొడిగించింది. మళ్లీ తిరిగి జూన్ 7న కవితపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నది.
వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్.. అక్రమాస్తుల కేసులో అరెస్టయి నేటికి అంటే... మే 27వ తేదీకి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2012 మే 27వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో దిల్ కుషా గెస్ట్ హౌస్‌లో వైయస్ జగన్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్‌లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) మార్చి 15న కవితను అరెస్టు చేసి... మరుసటి రోజు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు ముందు ఈడీ హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు(శుక్రవారం) ఈ కేసులో ఎన్ఫోర్సమెంట్ డైరక్టరేట్ - ఈడీ ఏడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు నిందితులో గురువారం సీబీఐ కోర్టును(CBI Court) ఆశ్రయించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.