Inter Exams : సర్వం సిద్ధం..?
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:28 AM
ఇంటర్ పరీక్షలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15 వరకూ ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. 1వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మూడో తేదీ నుంచి సెకెండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ...

ఒకటో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు
1 నుంచి ఫస్ట్ ఇయర్,
3 నుంచి సెకెండ్ ఇయర్
63 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 48,690 మంది
అనంతపురం విద్య, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ఇంటర్ పరీక్షలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15 వరకూ ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. 1వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్, మూడో తేదీ నుంచి సెకెండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 25,730 మంది, సెకెండ్ ఇయర్ విద్యార్థులు 22,960 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఐదు సిట్టింగ్ స్క్వాడ్, మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు
జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించారు. సీనియర్ లెక్చరర్, పీడీ, లైబ్రేరియనలలో ఇద్దరితో ఉండే సిట్టింగ్ స్క్వాడ్ టీంలు 5, పోలీస్ శాఖ నుంచి ఒక ఏఎ్‌సఐ, రెవెన్యూ నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ లెక్చరర్‌తో కూడిన ముగ్గురు సభ్యులుంటే ఫ్లైయింగ్‌స్క్వాడ్‌లు మూడు బృందాలను నియమించారు. అదేవిధంగా 900
మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల లైవ్ సీ్ట్రమింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఈ కెమెరాలు పనిచేయనున్నాయి.
పోలీస్టేషన్లకు ప్రశ్నపత్రాలు...
ఇంటర్ ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్టేషన్లకు తరలించారు. పోలీసుల భద్రత నడుమ పరీక్షలు ఉన్న రోజుల్లో ప్రశ్నాపత్రాలను తెచ్చేందుకు సీఎస్, డీఓ ఉదయం 8 గంటలకే చేరుకోవాలి. బోర్డు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సూచించిన సెట్ ప్రశ్నాపత్రాలను 8.30 గంటలకు పోలీస్టేషన్ల నుంచి తీసుకుని పరీక్ష కేంద్రాలకు బయలుదేరాలి. కేంద్రాలకు చేరుకున్న తర్వాత 8.45 గంటలకు ప్రశ్నాపత్రాలను ఓపెన చేయాలి. 8.55 గంటలకు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను అందజేయాలి.
8 గంటలకే కేంద్రాలకు...
విద్యార్థులు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి. 8.30 గంటలకు పరీక్షాకేంద్రాల్లోకి పంపుతారు. విద్యార్థులు ఎవరూ సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర డిజిటల్ పరికరాలను తమ వెంట కేంద్రాలోకి తీసుకుని వెళ్లరాదు. అదేవిధంగా పరీక్షల సిబ్బంది కూడా ఎవరూ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదు. కేవలం ఇంటర్ బోర్డు కేటాయించిన కీప్యాడ్ ఫోన్లు మాత్రమే చీఫ్ సూపరింటెండెంట్‌కు అనుమతి ఉంటుంది. నాన టీచింగ్ స్టాఫ్ సైతం ఉదయం 9 గంటల వరకూ కేంద్రాల్లో ఉండాలి. తర్వాత బయటకు వెళ్లిపోవాలి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నాన టీచింగ్ స్టాఫ్‌ను పరీక్షాపేపర్లను కట్టడం, ఇతర పనుల కోసం కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షలు పూర్తయిన తర్వాత అన్ని కేంద్రాల నుంచి వచ్చే 24 పేజీల ఆన్సర్ బుక్‌ల్లెను జిల్లాకేంద్రంలోని న్యూటౌన బాయ్స్ కాలేజ్‌లో ఉండే డిసి్ట్రక్ట్ రిసెప్షన అండ్ డిసి్ట్రబ్యూషన సెంటర్ (డీఆర్‌డీసీ)కి తరలించి భద్రపరుస్తారు.
ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూం
వచ్చే నెల 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్షల నిమిత్తం కంట్రోల్ రూంను ఆర్‌ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. 08554-277626 నెంబర్‌ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు గానీ, తల్లిదండ్రులుగానీ, ఇతరులు ఎవరైనా పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే...వెంటనే కంట్రోల్ రూంకు ఫోన చేసి సమాచారం ఇవ్వవచ్చు.
గంట ముందే కేంద్రాలకు వెళ్లండి
జిల్లాలో 63 కేంద్రాల్లో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి 1న ప్రారంభమై 15వ వరకూ ప్రధాన పరీక్షలన్నీ జరుగుతాయి. ముందు రోజే విద్యార్థులు సెంటర్లకు వెళ్లి తమ నంబర్లు సరి చూసుకుంటే మంచిది. జిల్లాలో 48,690 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. కేంద్రాల్లోకి ఎవరికీ సెల్‌ఫోన్లు అనుమతించం. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 8 గంటలకే చేరుకోవాలి.
-వెంకటరమణ, కన్వీనర్,పరీక్షల నిర్వహణ కమిటీ
మరిన్ని అనంతపురం వార్తల కోసం....