Home » CWC
కాంగ్రెస్(Congress) వర్కింగ్ కమిటీ రేపు(మంగళవారం) సమావేశం కానున్నది. ఉదయం 10.00 గంటలకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. ఐదు న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో కీలకమైన ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్ పార్టీ తుది మెరుగులు దిద్దుతోంది. ఈనెల 19న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మేనిఫెస్టోకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.
పార్లమెంటు ఎన్నికలపై ( Parliamentary Elections ) దృష్టి సారించామని, ఆలస్యం చేయకుండా త్వరలోనే లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ( KC Venugopal ) స్పష్టం చేశారు. గురువారం నాడు సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశం గురించి ఆయన మీడియాకు వివరాలు తెలిపారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగింది.ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( CWC ) సమావేశం గురువారం (ఈరోజు) ఏఐసీసీ కార్యాలయంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) అధ్యక్షత వహించారు. ఖర్గే అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మూడోసారి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చించారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతోంది. ఈనెల 21వ తేదీన ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సమావేశంలో చర్చిస్తారు.
దేశంలో కులగణనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడమనేది ప్రగతిశీలక, శక్తివంతమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిడబ్ల్యూసి సభ్యులు హాజరయ్యారు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక వినతి చేసింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను (Congress party) గుర్తుచేసుకున్న సీడబ్ల్యూసీ.. రాజకీయ ఒడిదొడుకులు పక్కన పెట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రస్తావించింది. 9 ఏళ్ళు గడిచినా ఢిల్లీ, హైదరాబాద్ ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొంది.