Share News

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:47 PM

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని గురువారం అసెం బ్లీ నుంచి సస్పెన్షన్‌ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్‌ పిలుపు మేరకు శుక్రవారం పెద్దపల్లి బస్టాండ్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

పెద్దపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని గురువారం అసెం బ్లీ నుంచి సస్పెన్షన్‌ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్‌ పిలుపు మేరకు శుక్రవారం పెద్దపల్లి బస్టాండ్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో కొద్దిసేపు ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజుకుమార్‌ మాట్లాడుతూ ఇది ప్రజాపాలన కాదని, నియంతృత్వ పాలన అని, బీఆర్‌ఎస్‌ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేపడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ తీరును ప్రజలు నిరసిస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ పార్టీ గొంతు నొక్కేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదన్నారు. నూనేటి సంపత్‌, మోహన్‌రావు, సలెంద్ర రాములు, చంద్రశేఖర్‌, లైశెట్టి బిక్షపతి, కార్తీక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 11:47 PM