Share News

Komuram Bheem: శైలజ మృతి పై ఆందోళన.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి అరెస్టు..

ABN , Publish Date - Nov 26 , 2024 | 07:33 AM

కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ (14) సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతు న్న 20 మంది విద్యార్థులు.. అక్టోబరు 30న పాఠశాలలో వాంతులు విరేచనాలతో అ స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

Komuram Bheem:  శైలజ మృతి పై ఆందోళన.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి అరెస్టు..

కొమురం భీం : కలుషిత ఆహారం (Contaminated fFood) తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ (Student Chaudary Sailaja) (14) చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి (Death) చెందింది. దీంతో గ్రామంలో ఆందోళన చేపట్టారు. శైలజ మృతదేహాన్ని గట్టి బందోబస్తు మధ్య స్వగ్రామం సవతిదాబా గ్రామానికి పోలీసులు తీసుకొచ్చారు. తమ బిడ్డకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరపబోమని కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో వారికి మద్దతుగా ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మిని హౌస్ అరెస్టు చేశారు. ప్రతి పక్ష పార్టీ లు, విద్యార్థి, గిరిజన సంఘాల నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పూర్తి వివరాలు..

కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ (14) సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 20 మంది విద్యార్థులు.. అక్టోబరు 30న పాఠశాలలో వాంతులు విరేచనాలతో అ స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వారిలో తొమ్మిదో తరగతి చదువుతున్న శైలజ, మరో ఇద్దరు తప్ప మిగతా అందరూ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ ముగ్గురికీ మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించి.. మరింత మెరుగైన వైద్యం కోసం ఈ నెల 5న హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి మెరుగుపడడంతో డిశ్చార్జ్‌ చేశారు. శైలజను దాదాపు 20 రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. శైలజ మరణవార్త వినగానే ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శైలజ మృతిచెందిందని ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై దాదాపు 27 రోజులు కావస్తున్నా అందుకుగల కారణాలను అధికారులు తెలుపకపోవడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, నష్టపరిహారం అందించాలని మాలీ సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా.. శైలజ మృతికి ప్రభుత్వమే బాధ్య వహించి, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. సర్కారు నిర్లక్ష్యానికి, అధికారుల అలసత్వానికి శైలజ బలైందని ఆయన ధ్వజమెత్తారు. గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం ఒక పాపం కాగా.. అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరో పాపమని హరీష్ రావు మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తొలి రోజే ‘అదానీ’ రచ్చ

ఎనిమిది గంటల పెళ్లి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 26 , 2024 | 08:41 AM