Home » Delhi Excise Policy
లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. అరెస్టు తర్వాత ఈడీ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని, ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్టు చేయడం చట్టనిబంధనలకు విరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. జైలులో ఉంటూ సమర్థవంతమైన పాలన అందించలేరంటూ తక్షణమే పదవి నుంచి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ వైభవ్ కుమార్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ లను ఈడీ సోమవారంనాడు విచారించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిశ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరో 12 రోజులు పొడిగించారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను గోవా కోర్టు తిరస్కరించింది. 2017 గోవా ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదైంది.
ఢిల్లీ సీఎం(delhi cm) అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను తన లాయర్‌తో కలిసేందుకు అనుమతి కోరుతూ వచ్చిన దరఖాస్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టులో వ్యతిరేకించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నందున ఆయనకు ప్రత్యేక మినహాయింపు ఇవ్వలేమని ఈడీ స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు ఈడీ ఈ వాదనలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు దర్యాప్తు సంస్థ సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. వచ్చే వారం సీబీఐ అధికారులు జైలులో కవితను ప్రశ్నిస్తారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్న క్రమంలో పార్టీని ఏకతాటిపై నడిపించ గలిగే సత్తా సునీతా కేజ్రీవాల్ కు ఉందని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.