Home » Devotees
ప్రతి ఏటా భాద్రపద కృష్ణ అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి లడ్డూ గోపాల్ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది. శుభ సమయం ఎప్పుడు, ఏ మంత్రం జపించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రాఖీ లేదా రక్షా బంధన్(Rakhi festival), సోదరులు, సోదరీమణుల మధ్య అంతులేని ప్రేమను ఈ వేడుక సూచిస్తుంది. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రవణ మాసం పౌర్ణమి నాడు వస్తుంది. అయితే రక్షాబంధన్ వేడుక ఎప్పుడు మొదలైంది, ముందుగా ఎవరికి రాఖీ కట్టారు, అసలు ఎందుకు ఈ పండుగను జరుపుకుంటున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Raksha Bandhan 2024: శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు. సోదరి, సోదరుల ప్రేమకు రాఖీ పండుగ ప్రతీక. ఈ సారి రక్షాబంధన్ 19 ఆగష్టు 2024న వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజున సరైన విధంగా.. శుభ సమయంలో తమ సోదరుని రాఖీ కడితే వారికి మేలు జరుగుతుంది.
తెలుగింటి ఆడపడుచుల ముఖ్యమైన పండుగల్లో శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం ప్రముఖమైన పండుగ. పూలు, గుమ్మాలకు మామిడాకులు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. లక్ష్మీదేవిని వరలక్ష్మీగా కూడా పిలుస్తారు. వరలక్ష్మీ అంటే వరాలు ప్రసాదించే దేవత అని అర్థం. ఆమె భక్తులకు అన్నీ విధాలా అనుగ్రహిస్తుంది. భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు.
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది.
శ్రావణ మాసం ధనుర్మాసంలో భాగం. ధనుర్మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతి. ఇక మహావిష్ణువు సతిగా, అష్టైశ్వార్యాలు ప్రసాదించే కల్పవల్లిగా ఆ మహాలక్ష్మిని వర మహాలక్ష్మిగా పూజిస్తారు.
పూర్యకాలంలో ఈ వ్రతాన్ని చారుమతి ఆచరించింది. తన భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, తోటివారికి అండగా ఉంటూ మంచి ప్రవర్తన కలది చారుమతి. ఆమె కలలో శ్రీమహాలక్ష్మి కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం తనను పూజించాలని చెబుతూ, వ్రత విధి విధానాలను తెలియచేసింది.
ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో అనేక మంది ఒక్కసారిగా ఒకరిపై ఒకరుపడగా, వారి నుంచి ఇంకొంత మంది భక్తులు దూసుకెళ్లారు. దీంతో ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మరణించగా, మరో 9 మందికి గాయాలయ్యాయి.
‘సత్య ప్రమాణం చేయడానికి రాజనాల బండకు రండి’ అంటూ కమ్మలు పోగొట్టుకున్న బాధితులు పిలవగానే నిందితుల్లో వణుకు మొదలైంది. రాత్రికి రాత్రే ఆ కమ్మలు, నగదు మూటకట్టి బాధితుడి ఆటోలో ఉంచి వెళ్లిపోయారు.
Vastu Shastra Rules: ఎంత పెద్ద కోటీశ్వరులైనా... కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించినా.. ఆ నిర్మాణానికి ముందు వాస్తును తప్పకుండా పాటిస్తారు. ఇంటి నిర్మాణం, డిజైన్ విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు.