Share News

Rafale Fighter Jets: 26 రఫేల్ మెరైన్ ఫైటర్ల కొనుగోలుకు భారత్ డీల్

ABN , Publish Date - Apr 09 , 2025 | 02:46 PM

కాంట్రాక్టుపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఐదేళ్లలోగా మన నావికాదళానికి ఈ రాఫలె జెట్‌లు అందుతాయి. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్‌ విమాన వాహక నౌకపై రఫేల్ మెరైన్‌లను మోహరించనున్నారు.

Rafale Fighter Jets: 26 రఫేల్ మెరైన్ ఫైటర్ల కొనుగోలుకు భారత్ డీల్

న్యూఢిల్లీ: భారత నౌకాదళం (Navy) అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫైటర్ జెట్లను సమకూర్చేందుకు భారత్ సిద్ధమైంది. ఫ్రాన్స్ (France) నుంచి 26 రఫేల్ మెరైన్ (Rafale Marine) ఫైటర్ విమానాల కొనుగోలు డీల్‌కు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఆమోదం తెలిపింది. ఫ్రాన్స్‌తో 'గవర్నర్‌మెంట్ టు గవర్నమెంట్' కింద జరుగనున్న ఈ ఒప్పందం విలువ రూ.63,000 కోట్లుగా అంచనా వేశారు.

Mumbai Dubai in 2 hours: ముంబై టూ దుబాయ్..2 గంటల్లోనే.. ఎలా సాధ్యమంటే


ఈ డీల్ కింద 22 సింగిల్ సీటర్ విమానాలు, శిక్షణ కోసం 4 ట్విన్ సీటర్ విమానాలను భారత్ కొనుగోలు చేస్తుంది. వీటి నిర్వహణ, విడిభాగాలా, లాజిస్టిక్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. దేశీయంగా కొన్ని విడిభాగాలు తయారు చేయాలనే షరతు కూడ ఇందులో ఉంది.


కాంట్రాక్టుపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఐదేళ్లలోగా మన నావికాదళానికి ఈ రాఫలె జెట్‌లు అందుతాయి. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్‌ విమాన వాహక నౌకపై రఫేల్ మెరైన్‌లను మోహరించనున్నారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న మిగ్ 29కే విమానాలకు ఇవి తోడుకానున్నాయి. కాగా, ఈ నెల చివర్లో ఫ్రాన్స్ రక్షణ మంత్రి సబాస్టిన్ లెకోర్ను భారత్‌లో పర్యటించనున్నందున ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్టు తెలుస్తోంది. తొలి బ్యాచ్ విమానాలు 2029లోనూ, 2031 నాటికి మొత్తం భారత్ చేతికి వచ్చే అవకాశాలున్నాయి.


ఇవి కూడా చదవండి..

Tahwwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Updated Date - Apr 09 , 2025 | 02:55 PM