Home » GHMC
జీహెచ్ఎంసీ(GHMC)లో ప్రజావాణి గాడి తప్పుతోంది. సమయానికి అధికారులు రాక.. ఫిర్యాదులు పరిష్కారం కాక పౌరులు మండిపడుతున్నారు. సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభం కాగా, ఒకరిద్దరు మినహా ఉన్నతాధికారులు అందుబాటులో లేరు.
మహానగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి రెండు రోజుల్లో సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్ రఘుప్రసాద్‌ను ఆదేశించారు. జోనల్, అదనపు కమిషనర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలకు ముందు చూపు లేక పోవడంతో.. ప్రజలు పడుతున్న అవస్థలన్నీ ఇన్నీ కావు. గద్దెనెక్కిన పాలకా గణం.. ప్రజా సంక్షేమం కోసం అంటూ తీసుకుంటున్న పలు నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్ఆర్ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్ఆర్ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్(M. Danakishore) అధికారులను ఆదేశించారు.
హైడ్రా పేరుతో పేద ప్రజలను పరేషాన్ చేయొద్దని, లేదంటే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హెచ్చరించారు.
మహానగరం చుట్టూ డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ(GHMC) కసరత్తు చేస్తోంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై వ్యర్థాల భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఆ భూములను బల్దియాకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లకు కమిషనర్ ఆమ్రపాలి(Commissioner Amrapali) లేఖ రాశారు.
మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని సర్కారు నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Hyderabad: జీహెచ్ఎంసీ కమిషనర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా చేసేందుకు చర్యలు చేపట్టిన కమిషనర్.. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.
వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు. అడిషనల్, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.