Share News

Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

ABN , Publish Date - Feb 21 , 2025 | 11:40 AM

హైదరాబాద్: జీహెచ్ఎంసి అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్ రాసలీలల వ్యవహారం బయటపడింది. వేరే మహిళతో ఉండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి తెలిపారు.

Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..
GHMC Joint Commissioner ..

హైదరాబాద్: జీహెచ్ఎంసి (GHMC)లో అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌ (Joint Commissioner)గా పనిచేస్తున్న జానకిరామ్ (Janakiram) రాసలీలల (Rasaleelalu) వ్యవహారం బయటపడింది. వేరే మహిళతో ఉండగా అతని భార్య కళ్యాణి (Wife Kalyani).. రెడ్ హ్యాండెడ్‌గా (Red-Handed) పట్టుకున్నారు. జానకిరామ్ తన కంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరినీ చితకబాదింది. కుటుంబాన్ని వదిలేసి గత కొద్ది రోజులుగా జానకిరామ్ వారాసిగూడలో ఆ అమ్మాయితో ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని భార్య కళ్యాణి నిగాపెట్టారు. సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్టుమెంట్‌లో ఉన్న రద్దరిని కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

బంజారాహిల్స్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్


కాగా జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడని భార్య కళ్యాణి తెలిపారు. గొడవ జరుగుతున్న సమయంలో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో వారాసిగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


నలుగురు విద్యార్థుల అదృశ్యం..

మరోవైపు అంబర్‌పేట్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లోని న్యూ చైతన్య పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు గురువారం పరీక్షలో కాపీ కొడుతుండగా గమనించిన టీచర్ తల్లిదండ్రులకు చెప్తానని మందలించడంతో సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకొని ఇంట్లో నుంచి విద్యార్థులు (నికిత్, హర్ష ,అజ్మత్, నితీష్) వెళ్లిపోయారు. దీంతో రాత్రి అయినా పిల్లలు రాకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అంబర్‌పేట్‌ పోలీసులు కాచిగూడ రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా విద్యార్థులు కనిపించారు. దీంతో దర్యాప్తు చేపేట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఆర్ పాటిల్‌ను కలిసిన చంద్రబాబు, పవన్

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు..

జగన్‌కు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 21 , 2025 | 12:44 PM