Home » Jagan
శాసనసభ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టయిన విశ్రాంత అదనపుల్ ఎస్పీ విజయ్‌పాల్‌ను విచారణ కోసం 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నగరంపాలెం(గుంటూరు) పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడనుంది.
విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ సోమవారం సాయం త్రం.....
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దందా బయటపడింది. పౌరసరఫరాల శాఖకు ఆయన అద్దెకు ఇచ్చిన గోదాముల్లో సుమారు 250 టన్నుల బియ్యం మాయమైంది.
ఐదేళ్ల కాలంలో అంతులేని దందాల కథ ఇది! సినిమాలుగా తీస్తే పది సీక్వెల్‌లు అవుతాయి! సీరియల్‌గా తీస్తే వందల ఎపిసోడ్లు కావాల్సిందే! రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు దున్నేయగా... జిల్లాల స్థాయిలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మేశారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేట పరిసరాల్లో వైసీపీ నేతలు పేదలను బెదిరించి వందలాది ఎకరాలు చేజిక్కించుకున్నారు.
వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన్ను ఆదివారం తెల్లవారుజామున అనంతపురం తీసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో చాలాచోట్ల మౌలిక సదుపాయాలు ఉంటే సరైన ఫలితాలు లేవు. అభ్యసన ఫలితాలు బాగున్న చోట సదుపాయాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి.
పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి.. చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికితోడు అడ్డగోలు తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిననే తలపొగరు. వెరసి పెన్షనర్స్ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకువచ్చారు.
‘ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన గుంటూరు మిర్చి యార్డులోకి వైసీపీ ప్రభుత్వ హయాంలో సంబంధం లేని వ్యక్తులు చొరబడ్డారు. అడుగడుగునా అవినీతికి పాల్పడి వ్యవస్థని కుప్పకూల్చారు’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
కాకినాడ పోర్టు నుంచి బియ్యం తీసుకువెళుతున్న స్టెల్లా నౌకను అణువణువూ తనిఖీ చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.