Home » Kanna Lakshminarayana
జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు సభలకు ప్రజాధరణ పెరిగింది. లోకేష్ పాదయాత్రకు వెయ్యి రెట్ల ప్రజాధరణ పెరిగింది. చంద్రబాబు పర్యటనలో వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు.
కుట్రలో భాగంగానే నాకు గన్‌మెన్లను తొలగించారు. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తున్నానని ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడింది. పల్నాడు జిల్లాలో భద్రతపరంగా నాకు ఇబ్బందులు ఉన్నా గన్‌మెన్లను విత్ డ్రా చేశారు. ప్రజలు జగన్‌కు మంచి మెజార్టీ ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయారు.
ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం జగన్ కే చెల్లిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జులై 20వ తేది వచ్చినా కనీసం కాలువలు మరమ్మతులు చేయలేదని.. రైతులు చాలా చోట్ల చందాలు వేసుకుని కాలువలు రిపేర్ చేసుకుంటున్నారన్నారు.
టీడీపీలో చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇక నేడు మంత్రి అంబటి రాంబాబు ప్రధాన అనుచరుడు ఆయనకు షాక్ ఇచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు.
సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన గ్రామంలో ఇంటింటికి కోడెల, పల్లె నిద్ర కార్యక్రమాన్ని టీడీపీ నేత కోడెల శివరాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు గడ్డ మీద పసుపు జెండా చూడగానే గుర్తొచ్చే నాయకుడు కోడెల శివప్రసాదరావు అన్నారు. తనను ఒంటరి వాడిని చేసి చుట్టుముట్టి ఎన్నో కుట్రలు చేస్తున్నారు.
పల్నాడు జిల్లా: సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను ప్రజలకు చూపించటానికే బస్సు యాత్ర చేపట్టామని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) అరాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దించే కుట్ర చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర సహకార రంగాన్ని వైసీపీ ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మార్చుకుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి వైసీపీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు సహకార రంగంలో రూ.5వేలకోట్ల దోపిడీ జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే కేంద్రహోంమంత్రి అమిత్ షాకు, నాబార్డ్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
టీడీపీలో నెలకొన్న పరిస్థితులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది..? ఫౌండేషన్ల పేరుతో జరుగుతున్న హడావుడి..? కోడెల శివరాం వ్యవహారం..? ఇలా అన్ని విషయాలపైనా...