Home » Kiran Kumar Reddy
పోలింగ్ రోజున అంతా ఊహించిన దానికీ, వెలువడిన ఫలితాలకు తేడాతో పాటు అందరి అంచనాలు తారుమారయ్యాయి. జిల్లాలోని పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఓటర్లు ఓటు వేయకపోయినా, ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేశారనే ప్రచారం ముమ్మరంగా సాగింది..
పేదల వికాసం కాదు మాఫియా వికాసం వైసీపీ సర్కార్ పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
తంబళ్లపల్లెలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువగా ఉందని, ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఐ కూటమి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. అంగళ్లులో కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకాయన ఏకంగా 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల అపార అనుభవం ఉన్న రాజకీయ దురంధరుడు.. ఇంకోకాయన దాదాపు నాలుగేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా, స్పీకర్‌గా విశేష సేవలు అందించిన రాజకీయ దిట్ట.. వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరూ ఒకానొకప్పుడు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకున్నారు. ‘నువ్వా-నేనా’ అంటూ సవాళ్లు విసుకున్నారు. ఎన్నో అవినీతి ఆరోపణలు గుప్పించుకున్నారు. కానీ కాలం గిర్రున తిరిగింది.
జంపేటను జిల్లా చేయకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాజంపేటలో గురువారం నాడు అరుదైన కాంబినేషన్ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆసీనులయ్యారు. రాజంపేట సభకు పెద్దసంఖ్యలో కూటమి నేతలు, అభిమానులు తరలివచ్చారు. కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఓ విషయంలో రెండుసార్లు తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి (Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం నాడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.