Kothagudem: దేశానికే మోడల్‌గా ఎర్త్‌సైన్సెస్ వర్సిటీ: తుమ్మల
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:40 AM
దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెంలో ఎర్త్‌సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, శ్రీరామనవమిలోగా ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన జీవో విడుదల చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఖమ్మం, మార్చి 29 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెంలో ఎర్త్‌సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోందని, శ్రీరామనవమిలోగా ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన జీవో విడుదల చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికే మోడల్‌గా నిలవబోనుందన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం లేనందున ఈ జిల్లాలో అన్నిరకాల ఖనిజ సంపద అపారంగా ఉందని, ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెంలో ఎర్త్‌సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరానని తెలిపారు.
దీనిపై ముఖ్యమంత్రి కూడా నిపుణులతో నివేదికలు తెప్పించుకుని వర్సిటీ మంజూరు చేశారన్నారు. ఈ యూనివర్శిటీ ఏర్పాటుతో తెలంగాణతోపాటు దేశంలోని పలురాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ చదివి భూగర్భ పరిశోధనలు నిర్వహించి శాస్త్రవేత్తలుగా దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురానున్నారని తెలిపారు. తెలంగాణ మొత్తం ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నందున కేంద్రం నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు తీసుకొచ్చామన్నారు. దాంతో అన్ని జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగుతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రజలకు, రైతులకు మంత్రి తుమ్మల శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News