Home » Nizamabad
లోక్‌సభ ఎన్నికల తరువాత దేశంలో రామరాజ్యం రాబోతోందని ఎంపీ ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) అన్నారు. నిజామాబాద్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా జనవరి 22న ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని కోరారు.
నిజామాబాద్ లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ప్రైవేట్ బస్సు లో నుంచి రూ.13 లక్షలను దుండగులు ఎత్తుకెళ్లారు.
బీఆర్ఎస్ ( BRS ) శ్రేణులు కాంగ్రెస్ ( Congress ) నేత సాదుల రాములుతో తీవ్ర ఘర్షణకు దిగారని.. ఈఘర్షణలో రాములుని కక్షతో హత్యచేశారని రాష్ట్ర ఎక్సైజ్ & టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లాలోని నసూర్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూఇయర్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకులు పాల్గొన్నారు.
Telangana: జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది.
Telangana: 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. 28 హత్యలలో 20 హత్యలు ఆస్తి, కుటుంబ సభ్యుల తగదాలతో జరిగినవన్నారు.
కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం, నర్సింగ్ రావ్ పల్లి శివారులో 161 జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బోలోరో వాహనం మోటార్ సైకిల్‌ను ఢీ కొంది.
ధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయంలో ప్రజాపాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు జారీ చేసింది.
Telangana: జిల్లాలోని దోమకొండలో వడ్డీ వ్యాపారి ఇంటిపై మహిళల దాడి చేశారు. కాశీనాథ్ అనే వ్యాపారి వద్ద కామారెడ్డికి చెందిన కవిత రూ.5 లక్షల అప్పు తీసుకుంది.
Telangana: జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్యల కేసులో నిందితుడు గొల్ల ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది.