Home » NRI News
American Airlines Flight Collides: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
NRI : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు వందలాాది మంది హాజరయ్యారు.
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ట్రంప్‌తో మాట్లాడిన విషయాన్ని మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహించే 76వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా – ఘనమైన నా భారతదేశపు గణతంత్రదినోత్సవం (76వ) ‘దేశభక్తి గీతాలతో భూమి భారతికి స్వర నీరాజనం పేరిట ఈనెల నిర్వహించారు.
అమెరికాలో ఉంటూ సంగీత కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తిఉన్నవారికోసం అమెరికాలోని తానా కళాశాల ప్రత్యేక సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. 2024-2025 సంవత్సరం కోసం ప్రవేశాలకు తానా కళాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
అధ్యక్షుడి కుర్చీలో కూర్చోగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాదాపు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా అక్రమ వలసదారులపై ప్రతాపం చూపిస్తున్నారు. అమెరికాలో ఏ మూలన ఉన్నా అక్రమ వలసదారులను ఉపేక్షించనని ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు.
ఎన్ఆర్ఐ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే "నెలనెలా తెలుగు వెలుగు" కార్యక్రమాన్ని ఈనెల 25న నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తెలిపారు.
ఎన్నికల ప్రచార సమయంలో తన భద్రతను పర్యవేక్షించి భారీ ప్రమాదం నుంచి తప్పించిన సెక్యూరిటీ ఏజెంట్ సీన్ కరన్‌కు మంచి పదవి అందించారు. అతడిని అమెరికా సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు. గతేడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో టొరంటోలోని మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికోలో ‘తీన్మార్ సంక్రాంతి’ పేరుతో సంక్రాంతి వేడుకలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించారు..
కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి మధ్యలో సౌదీ అరేబియా వెళ్లారు. ఖనిజ భవిష్యత్తుపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సమాజం కిషన్ రెడ్డికి నీరాజనం పలికింది.