TDS Exemption: గుడ్ న్యూస్.. వృద్ధుల పేరుతో ఇన్వెస్ట్ మెంట్, డబుల్ ప్రాఫిట్
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:43 PM
దేశంలో ఈరోజు (ఏప్రిల్ 1, 2025) నుంచి అమలవుతున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో వృద్ధులకు ఉపశమనం కలిగించే కీలక అప్‍డేట్ వచ్చేసింది. ఈ క్రమంలో టీడీఎస్ మినహాయింపు పరిమితి రూ. 50,000 నుంచి రూ.1,00,000 వరకు అమల్లోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 1, 2025 నుంచి వృద్ధుల వడ్డీ ఆదాయంపై TDS మినహాయింపు పరిమితి రూ. 50,000 నుంచి రూ.1,00,000 వరకు అమల్లోకి వచ్చింది. దీంతో సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వడ్డీ ఆదాయంపై లక్ష వరకు పన్ను రహిత ప్రయోజనాలను పొందుతారు. సాధారణంగా దేశంలోని చాలా మంది సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లను సురక్షితమైన, స్థిరమైన పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. పదవీ విరమణ తర్వాత, వారి ప్రధాన లక్ష్యం వారి పొదుపుల నుంచి ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి పొందడం.
పన్ను ఉపశమనం
అందుకే వారి ములధనాన్ని వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండే FD, SCSS వంటి ఇతర పథకాలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం FD, SCSS వంటి పథకాలపై పన్ను మినహాయింపు పరిధిని రెట్టింపు చేసింది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీతో పాటు పన్ను ఉపశమనం కూడా లభిస్తుంది. ఇది వారి ఆర్థిక స్థితిని మునుపటి కంటే మరింత మెరుగుచేస్తుంది. ప్రస్తుతం ఒక వృద్ధుడి FD నుంచి వార్షిక వడ్డీ ఆదాయం రూ. 50,000 దాటితే, దానిపై TDS తీసివేయబడుతుంది. కానీ బడ్జెట్ 2025 ప్రకారం, ఈ పరిమితి ఏప్రిల్ 1, 2025 నుంచి రూ. 1,00,000కు పెంచారు.
కుటుంబ పెద్దల పేరుతో
అంటే ఒక వృద్ధుడు FD లేదా SCSS నుంచి సంవత్సరానికి రూ. 1,00,000 వరకు వడ్డీని సంపాదిస్తే, అతను TDS నుంచి మినహాయించబడతాడు. ఇదే సమయంలో సాధారణ పెట్టుబడిదారులకు ఈ పరిమితి రూ. 40,000 వరకు మాత్రమే ఉంది. కాబట్టి, మీరు మీ పేరు మీద FD చేస్తే, TDS తగ్గింపును ఎదుర్కొంటారు. కానీ మీ కుటుంబ పెద్దల పేరుతో మీరు FD చేస్తే, మీకు రెండు పెద్ద ప్రయోజనాలు లభిస్తాయి. సాధారణ పెట్టుబడిదారుల కంటే సీనియర్ సిటిజన్లకు FDలపై 0.50% ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం, సీనియర్ సిటిజన్లు రూ. 1,00,000 వరకు వడ్డీ ఆదాయంపై TDS మినహాయింపు పొందుతారు.
రెట్టింపు ప్రయోజనం
ఉదాహరణకు మీరు 3 సంవత్సరాల FDలో రూ. 3,00,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మీకు వడ్డీ రేటు 7%. ఇలాంటి పరిస్థితుల్లో మీకు మొత్తం రూ. 69,432 వడ్డీ లభిస్తుంది. కానీ సాధారణ పెట్టుబడిదారులకు TDS పరిమితి రూ. 40,000 మాత్రమే కాబట్టి, మీ వడ్డీ ఆదాయంపై TDS తగ్గించబడుతుంది. అదే FD మీ కుటుంబంలోని వృద్ధ సభ్యుని పేరు మీద చేస్తే, వడ్డీ రేటు 7.5% ఉంటుంది. ఆ క్రమంలో వడ్డీ రూపంలో రూ. 74,915 వస్తుంది. అలాగే, సీనియర్ సిటిజన్లకు TDS పరిమితి ఇప్పుడు రూ. 1,00,000కి పెరిగినందున, ఈ వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..
Stock Market Crash: స్టాక్ మార్కెట్లో 1,390 పాయింట్లు డౌన్.. గంటల్లోనే లక్షల కోట్ల నష్టం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News

చిన్నగా మొదలైన కంపెనీ..ఇప్పుడు రూ.1400 కోట్లతో మరో సంస్థని కొనుగోలు..

పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం

అధిక పింఛన్ అప్లికేషన్లు తిరస్కరణ..ఆందోళనలో 7 లక్షల మంది

పొదుపు నుంచి పెట్టుబడి వరకు.. స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళలు

ఐపీవో బాటలో మూడు కంపెనీలు..
