Home » Peddapalli
ఓదెల మల్లికార్జునస్వామి కల్యాణాన్ని సోమవారం పురోహితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య మధ్యాహ్నం 1.19 గంటలకు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దంపతులు పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. మార్చి 31వ తేదీ వరకు క్రమబద్దీకరించే వారికి 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనధికారిక లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇవ్వగా రుసుం ఎక్కువగా ఉండడంతో ఆసక్తి చూప లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రుసుంలను సవరిస్తామని ప్రకటించింది. అయితే అందుకు సంబంధించి జారీ చేసే ఉత్తర్వులపై ఎల్ఆర్ఎస్ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో కొత్తగా సల్ఫర్ కోటెడ్ యూరియాను తయారు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రోజుకు 3850టన్నుల సామర్థ్యంతో నీమ్ కోటెడ్ యూరియాను ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి చేస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజా వుగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, సంబంధిత అధికా రులతో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీఓల సంఘం రాష్ర్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. శనివారం ఆయన పెద్దపల్లిలో సం ఘం నాయకులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమస్యల పరిష్కారం అవుతుం దని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం సెంటినరీకాలనీ ఐఎన్టీయుసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు.
టమాట సాగు చేస్తున్న రైతులకు తీరని కష్టాలు వచ్చాయి. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో, కనీసం పెట్టుబడులు కూడా దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మార్కెట్లో కిలో టమాట పది నుంచి పదిహేను రూపాయలుండగా రైతులకు కిలో మూడు, నాలుగు రూపాయలు కూడా ఇవ్వడం లేదు.
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభ పెట్టకుండా పకడ్బందీ నిఽఘా పెట్టాలని, పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని అరుణోదయ రాష్ట్ర నాయకురాలు విమలక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను, ఆదివాసీలను కేంద్ర ప్రభుత్వం హత మారుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా తమ పౌరుషాన్ని, దమ్ము చూపాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో మాట్లాడారు.