Share News

సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:52 PM

సహకార సంఘాలు వ్యాపారాలు నిర్వహిస్తూ రైతుల, సంఘాల ఆర్థిక పరిపుష్టి కావాలని కేరళ రాష్ట్ర సహకార బ్యాంక్‌ ఉపాధ్యక్షుడు కే కన్నన్‌ అన్నారు. కేరళ సహకార సం ఘం పాలకవర్గం సభ్యులు, అధికారులతో కలిసి సోమ వారం సుల్తానాబాద్‌లోని సహకార సంఘాన్ని సందర్శిం చారు.

సహకార సంఘాలు  ఆర్థిక పరిపుష్టి సాధించాలి

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంద్రజ్యోతి): సహకార సంఘాలు వ్యాపారాలు నిర్వహిస్తూ రైతుల, సంఘాల ఆర్థిక పరిపుష్టి కావాలని కేరళ రాష్ట్ర సహకార బ్యాంక్‌ ఉపాధ్యక్షుడు కే కన్నన్‌ అన్నారు. కేరళ సహకార సం ఘం పాలకవర్గం సభ్యులు, అధికారులతో కలిసి సోమ వారం సుల్తానాబాద్‌లోని సహకార సంఘాన్ని సందర్శిం చారు. ఈ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక వ్యాపారాలను కేరళ బృందం పరిశీలించింది. అనంతరం వారు మాట్లాడుతూ సహకార రంగంలో కేరళ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. సహకార సంఘాలు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తూ అభివృద్ధి చెందాల న్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ యంత్రాలకు ప్రాధాన్యత ఏర్పడుతుందని వాటిని రైతులకు కిరాయికి ఇవ్వాలని సూచించారు. కేరళ రాష్ట్ర సహ కార సంఘాలు డిపాజిట్‌లు సేకరించి స్వంతంగా రైతులకు రుణాలు ఇస్తూ ఇతర సేవలు కొనసాగిస్తున్నాయని వివ రించారు. ఇక్కడ కూడా డిపాజిట్స్‌ సేక రించి రైతులకు సేవలు అందించవచ్చని తెలిపారు. గ్రీన్‌లాలు, వికె ప్రసాద్‌, డిజి ఎంకేటి నారాయణ సునీత ఉన్నారు. సిం గిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, రిజి స్టర్‌ వెంకటేశ్వర్లు, మేనేజర్‌ శశిధర్‌ రావు, సత్యనారాయణ రావు, మహేష్‌ శర్మ పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:52 PM