Share News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:30 AM

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీఓల సంఘం రాష్ర్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ అన్నారు. శనివారం ఆయన పెద్దపల్లిలో సం ఘం నాయకులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం

పెద్దపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీఓల సంఘం రాష్ర్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ అన్నారు. శనివారం ఆయన పెద్దపల్లిలో సం ఘం నాయకులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డీఏలు, పీఆర్‌సీ, సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ బిల్లుల గురించి చర్చించామని, సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. వచ్చే ఏప్రిల్‌, మేలో ముఖ్యమంత్రి ప్రత్యేక అతిథిగా ఎల్‌బీ స్టేడియంలో సమావేశం నిర్వహించేటట్టు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ బొంకూరి శంకర్‌, ప్రధాన కార్యదర్శి పి సత్యనారాయణ జగదీశ్వర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు రాగి శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సంఘ అధ్యక్షులు రాజన్న, జిల్లా మహిళా ఉద్యోగ సంఘ అధ్యక్షులు అనిత, నాన్‌ గెజిటెడ్‌ సంఘ ట్రెజరర్‌ శ్రీనివాస్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కొమురయ్య, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మహేందర్‌ రెడ్డి, అర్బన్‌ సెక్రటరీ ప్రవీణ్‌, సందీప్‌రావు, మధు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:30 AM