Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:28 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సమస్యల పరిష్కారం అవుతుం దని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం సెంటినరీకాలనీ ఐఎన్‌టీయుసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సమస్యల పరిష్కారం

రామగిరి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సమస్యల పరిష్కారం అవుతుం దని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం సెంటినరీకాలనీ ఐఎన్‌టీయుసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉన్న అల్ఫోర్స్‌ కళాశాలల కరస్పాం డెంట్‌ నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బలపర్చిందన్నారు. సింగరేణి అధికారులు, కార్మికు లు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ ఎస్‌ పదేళ్ళలో డీఎస్సీ, గ్రూప్‌-1 పోస్టుల ఉసే త్తలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం వచ్చిన సంవత్సరంలోనే న్యాయపరమైన చిక్కు లను పూర్తి చేసి 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామ న్నారు. సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న క్లరికల్‌ ఉద్యోగావకాశాలను కల్పించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు సంవత్సరానికి వడ్డీ రూ. 67 వేల కోట్లు చెల్లింపు చేస్తున్నామన్నారు. అప్పులు చెల్లిస్తూనే విద్య, వైద్యం, రైతుల సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రుణమాఫీతో పాటు సన్న రకాలకు బోనస్‌, రైతు భరోసా, ఇందిరమ్మ గృహాలకు చెల్లింపు చేసినట్లు తెలిపారు. ప్రైవెట్‌ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేల బోనస్‌ చెల్లించినట్లు పేర్కొ న్నారు. జీవో 317 ప్రకారం జోన్‌లుగా విభజించి ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేప ట్టినట్లు పేర్కొన్నారు. డీఎస్సీ 2014 కోర్టు నిర్ణయం మేరకు ఉద్యోగావకాశాలతోపాటు స్థానికంగా బదిలీ చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్‌రెడ్డిని బలపర్చలని కోరారు. ఐఎన్‌టీయుసీ ఉపాధ్యక్షుడు నర్సింహ రెడ్డి, ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు కొటరవీందర్‌రెడ్డి, నాయకులు బాపు, మైదం వరప్రసాద్‌, కొము రయ్యగౌడ్‌, బర్లశ్రీనివాస్‌, తులసిరాంగౌడ్‌, ఎల్లెరాం మూర్తి, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 12:28 AM