Home » Ponguleti Srinivasa Reddy
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను యుద్ధ ప్రతిపాదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆదేశించారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
పేదోడి ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి , సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు రెండు కళ్లు, జోడెడ్ల లాగా సాగుతున్నాయని తెలిపారు.
గత ప్రభుత్వంలో ‘ధరణి’ పేర ఓ పెద్ద మనిషి ప్రజలను దగా చేశారని, ఆ పోర్టల్ రైతుల పాలిట శాపంగా, భూతంగా మారిందని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి విమర్శించారు.
మూసీ నది అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీనది అభివృద్ధి ప్రాజెక్టుతో.. ఇక పెట్టుబడులంటే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేస్తామని ప్రకటించారు.
ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదని.. అదంతా గులాబీ నేతలు చేసుకుంటున్నా ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఎక్కడికి పోరని తేల్చిచెప్పారు.
లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) పెండింగ్ దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనుంది. దరఖాస్తుల పరిష్కారానికి జిల్లాకో బృందాన్ని ప్రత్యేకంగా నియమించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 బృందాలు ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిశీలించనున్నాయి.
తెలంగాణలో మళ్లీ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS)ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు కీలక ప్రకటన జారీ చేసింది. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇతర ఉన్నతాధికారులతోసమీక్షా సమావేశం నిర్వహించారు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ మోసపూరిత బ్యాంకు గ్యారంటీలతో వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు దక్కించుకుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.