Home » Prathyekam
ఉత్తర భారతదేశంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దామో ఏరియాలో వరద పోటెత్తింది. బటియాగఢ్ నుంచి టూ వీలర్ మీద ఓ యువకుడు స్వగ్రామం మగ్రాన్ వెళ్తున్నాడు. అతని వాహనం బ్రిడ్జీ వద్దకు రాగానే వరద ప్రవాహం పెరిగింది.
కొందరు తిన్నగా ఉండరు. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం అంటే తెగ ఇష్టం. పబ్లిక్గా నాశనం చేస్తుంటారు. అలాంటి కోవకు చెందుతాడు ఇతను. వందేభారత్ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ కిటికీపై దాడి చేశాడు. అతని చేష్టలను వెనక నుంచి వీడియో తీశారు.
స్కూల్ ఆవరణలో విద్యార్థినిలు ఉన్నారు. వారి చేతుల్లో బీర్ బాటిళ్లు ఉన్నాయి. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Viral News: దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి ఓ వినాయకుడిని నెలకొల్పి సంబరాలు చేసుకుంటున్నారు జనులు. వినాయక మండపాల వద్ద భక్తులు కోలాహలం చేస్తున్నారు. విజ్ఞేశ్వరుడిని రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న సరే స్థానిక భాష నేర్చుకోవాలి. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇంట్రెస్ట్ చూపించరు. జర్మనీకి చెందిన జెన్నీఫర్ మాత్రం కన్నడ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతూ ఓ వీడియో కూడా తీసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
Flight Ticket Bookings: విమానంలో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావిస్తుంటారు. అయితే, విమాన ప్రయాణాన్ని ఆస్వాదించడం అంత సులువైన పని కాదు. ఫ్లైట్ ట్రావెలింగ్ ఛార్జెట్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే, ప్రస్తుత కాలంలో విమానయనరంగంలో పోటీ పెరుగుతోంది.
బ్లాక్ కలర్ చీర పట్టుకున్న టీచర్ స్టెప్పులేసింది. ఆ వీడియో 1.30 నిమిషాలు ఉంది. ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేశారు. మిగతా టీచర్లు ఎంకరేజ్ చేస్తోండగా.. విద్యార్థులు ఈలలతో జోష్ నింపారు. వీడియో బయటకు రాగా.. ఆ టీచర్ తీరును నెటిజన్లు తప్పు పట్టారు. ఆ లేడీ టీచర్ ఇలా డ్యాన్స్ చేయడం సరికాదని హితవు పలికారు.
ఉదయం లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు టీ తీసుకుంటూనే ఉంటారు. ఛాయ్లలో చాలా రకాలు ఉంటాయి. అల్లం ఛాయ్, ఇరానీ ఛాయ్, మలాయ్ ఛాయ్ అలా.. ఒక్కో వైరెటీకి ఒక్కో ధర ఉంటుంది. ఎంత కాస్ట్లీ అయినా రూ.20 నుంచి రూ.30 వరకు ఉంటుంది. ఏరియాను బట్టి ధర నిర్ణయిస్తారు.
సూపర్ టైఫూన్ యాగితో డ్రాగన్ చైనా చిగురుటాకులా వణుకుతోంది. చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రోడ్డు మీద ఉన్న వ్యక్తులు ఎగిరిపోయారు. ఇంటి పై కప్పులో ఉన్న రేకులు ఊడిపోయాయి.
కృర మృగాలపై ప్రేమ చూపిస్తే అవి కూడా మమకారంగా ఉంటాయి. పులి, సింహం ఇందుకు అతీతం కాదు. ఓ వృద్దురాలు పులితో చక్కగా ఆడుతోంది. పాలు తాగిస్తూ, లాలిస్తూ.. మాట్లాడుతుంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.