Home » Pravasa
బెంగళూర్‌కు చెందిన మహ్మద్ గౌస్ కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. అతని పేరు క్రిమినల్ పేరుతో పోలి ఉండటంతో జెద్దా ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమచారం ఇచ్చారు. 22 ఏళ్ల క్రితం జరిగిన నేరానికి సంబంధించి గాలిస్తోన్న నేరస్థుని వివరాలు గౌస్‌తో సరిపోలాయి. గౌస్‌ను నేరం జరిగిన ప్రదేశం అసీర్‌లో (అభా) గల అల్ జరీబ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇది జెద్దా నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కొత్త కార్యవర్గం ఏర్పడింది. తానా ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్‌గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో కొత్త సభ్యుల ఎన్నికపై ప్రతిష్ఠంభన వీడింది. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఎన్నికపై నెలకొన్న వివాదం సమసిపోయింది.