Home » Ramoji Group
చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోను నిర్మించిన దిగ్గజం. 2016లోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్న మహోన్నత వ్యక్తి.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతిపై సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొద్ది రోజులుగా అస్వస్థులుగా ఉండటం, బీపీ నియంత్రణ లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు.
పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి.
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు (Eenadu Groups Chairperson CH Ramoji Rao) సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..