Home » RBI
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ బెడద ఎక్కువై పోయింది. వాస్తవాలకు విరుద్ధంగా జరుగుతున్న ఎన్నో ప్రచారాలు జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఇలాంటిదే ఒక ప్రచారం జరిగింది. అదేంటంటే నక్షత్రం (*) గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవని దేశంలోని పలు చోట్ల జోరుగా ప్రచారం జరిగింది.
ఆర్థిక రాజధాని ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ బాంబు బెదరింపు ఒకటి మంగళవారంనాడు తీవ్ర కలకలం రేపింది. ఆర్బీఐ, మరో రెండు ప్రైవేటు బ్యాంకులను పేల్చివేస్తామని ఈ-మెయిల్ సెండర్ బెదిరించాడు. తాము 'ఖిలాఫత్ ఇండియా'కు చెందినట్టు అతను క్లెయిమ్ చేసుకున్నాడు.
మీరు గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ సిరీస్ IIIని విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడో సారి విడుదల కానున్న ఈ స్కీమ్ సోమవారం (డిసెంబర్ 18) నుంచి ప్రారంభమవుతుంది.
రూ.2,000 నోట్లు 97.26 శాతం బ్యాంకుల్లో జమ అయినట్టు రిజర్వ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది 19 వరకూ సర్క్యులేషన్లో ఉన్న నోట్ల లీగల్ టెండర్ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. 2.7 శాతం బ్యాంకునోట్లు ఇంకా సర్క్యులేషన్లో ఉన్నట్టు పేర్కొంది.
Bank Holidays in December: ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో యాప్స్, ఇతర మార్గాల ద్వారా డిజిటల్ లావాదేవీలు భారీగానే పెరిగాయి. అయినా సరే.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరి వెళ్లాల్సి ఉంటుంది. లోన్స్, గోల్డ్ లోన్ వంటి వాటి కోసం బ్యాంక్‌కు కచ్చితంగా వెళ్లాల్సిందే.
పర్సనల్ లోన్స్(Personnel Loans) తీసుకుంటున్నారా.. అయితే మీకొక అలర్ట్. వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆదేశాలు జారీ చేసింది.
రూ.2 వేలను మార్చుకోవాలని ఆర్బీఐ విధించిన గడువు అక్టోబర్ 7తో ముగిసింది. అయితే నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ(RBI) మళ్లీ రెండు ఛాన్స్‌లు కల్పించింది. ప్రస్తుతం మీ దగ్గర 2 వేల నోట్లు(RS.2000 Notes)ఉంటే.. పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్బీఐకి నగదు పంపుకోవచ్చు. Insured Post ద్వారా నగదును పంపవచ్చు. తద్వారా అకౌంట్లో సదరు నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. లోకల్ ఆఫీసులకు దూరంగా ఉన్న వారికి ఈ ఛాన్స్ కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం మంగళవారం మళ్లీ రూ. 450 కోట్ల అప్పు తెచ్చింది. ఆర్బీలో బాండ్ల వేలం ద్వారా 15 సంవత్సరాలకు గానూ 7.67 శాతం వడ్డీకి జగన్ సర్కారు అప్పు తీసుకుంది. ఈ అప్పుతో ఇప్పటివరకు ఎఫ్ఆర్బిఎం కింద ఏపీ రుణం రూ. 44 వేల 500 కోట్లకు చేరింది.
గృహ రుణాలతోపాటు ఇతర ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి చిన్నపాటి గుడ్‌న్యూస్. కీలకమైన రెపో రేటులో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించేందుకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమావేశంలో (monetary policy committee) ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటన చేసింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు ఈనెల 30వ తేదీన ముగియనుండటంతో గడువును అక్టోబర్ 7వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ శనివారంనాడు ప్రకటించింది.