Home » Telangana Govt
KPHB Lands: భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kidney Racket: అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈకేసులో సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారుగా, గ్రహితీలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.
CM Revanth Reddy: తెలంగాణాకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం సక్సెస్ అయింది. మొత్తం పది కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. దాదాపు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
Danam Nagender: తెలంగాణ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని... కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు.
New Ration Cards: కులగణన సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు జారీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. రేషన్ కార్డు దరఖాస్తుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కులగణన సర్వే ఆధారంగా కాకుండా గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Ration Cards: కొత్త రేషన్ కార్డు జాబితాలో పేర్లు లేకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే మంత్రులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతం కొనసాగుతుందని తెలిపారు. అలాగే గ్రామాల్లో జరిగే గ్రామ సభలో కొత్త రేషన్ కార్డులకు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. నేటి నుంచి (జనవరి 21) నుంచి జనవరి 24 వరకు కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Bhubharathi Act: భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. డిసెంబర్ 20వ తేదీన భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం డిసెంబర్ 30వ తేదీన గవర్నర్ కార్యాలయానికి భూభారతి బిల్లు చేరింది. ఈరోజు భూభారతి చట్టానికి ఆమోదం తెలుపుతూ గవర్నరం నిర్ణయం తీసుకున్నారు.
Telangana: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటీషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ కేసులో హైకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురైన విషయం తెలిసిందే.
Telangana: బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లను గ్రీన్ కో కంపెనీ చెల్లించిందని.. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు సమాచారం. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది.
Ration Card: చాలా మందికి రేషన్‌కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలో.. అసలు రేషన్ కార్డుకు అవసరమైన పత్రాలు ఏంటో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా నూతన వధువు మెట్టింట్లోని రేషన్‌కార్డులో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వారికి పుట్టే పిల్లల పేర్లను కూడా యాడ్ చేసుకోవాలి.