Home » TG News
గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కే. తారకరామారావు శనివారం సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు.
బస్తర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టు పార్టీల మధ్య కాల్పుల విరమణ జరగాలని, ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజానిదేనని పలువురు మేధావులు, రాజకీయ నేతలు పిలుపునిచ్చారు.
సురానా గ్రూపు కంపెనీలు.. రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకులను ముంచేశాయి. ఈ కంపెనీలకు చెందిన మరో రెండు రియల్ ఎస్టేట్ సంస్థల బండారాన్ని ఈడీ అధికారులు బట్టబయలు చేశారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎ్‌సఎస్) సభ్యులు మనిషి మనిషినీ కలుస్తుంటారని.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా అదే తరహాలో ప్రజలను కలవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు.
బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ కంచ గచ్చిబౌలి భూముల విషయంపై గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రూప్-1 పరీక్షలు రాసిన నిరుద్యోగుల జీవితాలు అగాథంలో పడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అగౌరవపర్చే విధంగా ఫొటో ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ ఎప్‌సెట్-2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు శనివారం(19వ తేదీ) నుంచి హాల్‌టికెట్లను జేఎన్టీయూ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు.
బీఆర్ఎస్ హయాంలో హైటెక్ సిటీలో రంగులు వేసి దాన్నే అభివృద్ధి అని చెప్పుకొంటూ ప్రచారం చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కొన్ని పనులు చేశారని విమర్శించారు.
సోనియాగాంధీ కుటుంబం డూప్లికేట్ గాంధీ కుటుంబమని, నేషనల్ హెరాల్డ్‌కు చెందిన రూ.వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.