Home » TG News
ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. అసెంబ్లీలో ఈమేరకు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు తేల్చిచెప్పారు.
కూతురు బాగా చదివి ఉద్యోగం చేసి కుటుంబ కష్టాలను గట్టెక్కిస్తుందని భావించిన ఓ పేద కుటుంబానికి తీరని శోకం మిగిలింది. ప్రేమ పేరుతో యువకుడు పెట్టిన వేధింపులకు మనస్తాపం చెందిన చదువుల తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
అల్వాల్(Alwal) రెసిడెన్షియల్ జోన్‌గా ప్రసిద్ది చెందింది. ఇలా ఏళ్ళ క్రితం ఆవిర్భవించిన కాలనీల సముదాయాలతో పాటు ఇక్కడ ఉన్న ఫంక్షన్ హాళ్లతో స్థానికులకు నిద్రాభంగం కలుగుతోంది. ఆయా ఫంక్షన్ హాళ్ల సమీపంలో ఉండే నివాసితులకు ఉదయం నుంచి రాత్రి వరకు మైక్‌లు, ఆర్కెస్ర్టాల శబ్దాలతో నిర్వాహకులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్(Malakpet Police Station) పరిధిలో బుధవారం జరిగింది.
ఆరోగ్య కేంద్రాల్లో ఈవెనింగ్ క్లినిక్స్(Evening Clinics) సేవలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. కొద్ది నెలల నుంచి సాయంత్రం క్లినిక్‌లు తెరవకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. బుధవారం యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి(Bhuvanagiri)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అరుదైన జాతులకు చెందిన తాబేళ్లను అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు(Malkajgiri SOT Police) అరెస్ట్ చేశారు. మేడిపల్లి పీర్జాదిగూడకు చెందిన షేక్ జానీ(50) ఆదర్ష్నగర్లో ఫేమస్ ఆక్వేరియం పేరుతో చేపలు, పక్షుల విక్రయాలు చేస్తున్నాడు.
కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు పోలీ్‌సస్టేషన్ ఎస్సై సాయికుమార్ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు.
సినీ పరిశ్రమతో ఏవైనా సమస్యలు ఎదురైతే రాజకీయాలు చేయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు.