Home » Vidyasagar
నటి జత్వాని కేసులో నిందితుడు విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5న హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. సోమవారం (9వ తేదీ) తీర్పు వెల్లడించనున్నట్లు పేర్కొంది.
నటి జెత్వానీ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్ వద్ద అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు.
Telangana: కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను యశోదా ఆస్పత్రికి తరలించారు.