Share News

TDP Leaders Clash: టీడీపీలో వర్గవిభేదాలు.. మంత్రి సమక్ష్యంలోనే ఘర్షణ

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:58 PM

TDP Leaders Clash: అన్నమయ్య జిల్లా టీడీపీలో రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇవాళ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎదుటనే ఢీ అంటే ఢీ అని కొట్టుకునే వరకు ఇరువర్గాల నేతలు వెళ్లారు. రెండు వర్గాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు మాత్రం వినకపోయే సరికి మంత్రి కూడా చేతులు ఎత్తేశారు. ఈ వివాదాన్ని టీడీపీ హై కమాండ్ దృష్టికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

TDP Leaders Clash:  టీడీపీలో వర్గవిభేదాలు.. మంత్రి సమక్ష్యంలోనే ఘర్షణ
TDP Leaders Clash

అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సాక్షిగా ఘర్షణకు నేతలు దిగారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణుల సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్ర రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు.


హార్స్లీ హిల్స్‌లో ఆదివారం నాడు జరిగిన ఈ సమావేశంలో మంత్రి జనార్దన్ రెడ్డి ఎదుటే ఇరువర్గాల నేతలు సవాళ్లు విసురుకొని ధూషించుకున్నారు. ఈ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించుకుని మంత్రి జనార్దన్ రెడ్డి వెళ్లిపోయారు. తంబళ్లపల్లె టీడీపీలో నివురు గప్పిన నిప్పులా వర్గపోరు కొనసాగుతోంది. మంత్రి జనార్దన్ రెడ్డి ముందే ఒక్కసారిగా వర్గపోరు బయటపడింది. రెండు వర్గాలకు టీడీపీ హై కమాండ్‌ నచ్చజెప్పాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Nara Lokesh: సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం

AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Birthday Celebrations: 20 నుంచి కర్నూలులో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 13 , 2025 | 02:03 PM