స్కూల్స్ లేవు కదా అని పిల్లల్ని పనులకు పంపిస్తున్నారా..? ఈ పదో తరగతి కుర్రాడెలా చనిపోయాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-07-07T18:22:09+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు లేకపోవడంతో పేద కుటుంబాలకు చెందిన చాలా మంది పిల్లలు కూలి పనులకు వెళుతున్నారు.

స్కూల్స్ లేవు కదా అని పిల్లల్ని పనులకు పంపిస్తున్నారా..? ఈ పదో తరగతి కుర్రాడెలా చనిపోయాడో తెలిస్తే..

లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు లేకపోవడంతో పేద కుటుంబాలకు చెందిన చాలా మంది పిల్లలు కూలి పనులకు వెళుతున్నారు. మహారాష్ట్రలోని దహాను ప్రాంతానికి చెందిన ప్రదీప్ రాజ్ కూడా అలాగే ఓ పనికి వెళ్లి అక్కడ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. స్కూళ్లకు సెలవులు కావడంతో ఒక ఆఫీస్‌లో బాయ్‌గా జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ కొన్ని రోజులు పనిచేసిన ప్రదీప్ మేనేజర్ వేధింపుల కారణంగా తాజాగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 


చనిపోయే ముందు ఓ లేఖ కూడా రాశాడు. `అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా. జాగ్రత్తగా ఉండండి. నా స్నేహితులందరినీ మిస్ అవుతున్నా` అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అలాగే తను పని చేస్తున్న ఆఫీస్‌లోని మేనేజర్ తనను మానసికంగా వేధిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానని లేఖలో రాశాడు. ఆ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-07-07T18:22:09+05:30 IST