ఇద్దరు ఎమ్మెల్యేలపై బీఎస్పీ బహిష్కరణ వేటు!

ABN , First Publish Date - 2021-06-04T03:10:15+05:30 IST

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి చెందిన శాసన సభాపక్ష నేత సహా...

ఇద్దరు ఎమ్మెల్యేలపై బీఎస్పీ బహిష్కరణ వేటు!

లక్నో: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి చెందిన శాసన సభాపక్ష నేత సహా ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. యూపీ అసెంబ్లీలో బీఎస్పీఎల్పీ నేతగా ఉన్న లాల్జీ వర్మ, ఎమ్మెల్యే రామ్ అచల్ రాజ్భర్‌ ఇద్దరూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఇద్దర్నీ ఇకపై ఎలాంటి పార్టీ కార్యక్రమాలకూ ఆహ్వానించబోమనీ... వారికి ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వబోమని బీఎస్పీ స్పష్టం చేసింది. పార్టీ శాసన సభాపక్ష నేతగా వర్మ స్థానంలో షా ఆలం అలియాస్ గుడ్డు జమలిని నియమిస్తున్నట్టు తెలిపింది. అయితే అంబేద్కర్ నగర్ జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇరువురు ఎమ్మెల్యేలు తాము పార్టీలోనే కొనసాగుతామంటూ ప్రకటించడం గమనార్హం.

Updated Date - 2021-06-04T03:10:15+05:30 IST