Domestic Violence: ఎమ్మెల్యే రాజా భయ్యాపై గృహహింస కేసు
ABN , Publish Date - Mar 09 , 2025 | 07:43 PM
రాజాభయ్యా చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో భన్విసింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని కుందా నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా (Raja Bhaiya)పై గృహహింస (Domestic Violence) కింద కేసు నమోదైంది. ఆయన భార్య భన్వి సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎంక్లేవ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Ramdev Baba: అమెరికా 'టారిఫ్ టెర్రరిజం'... రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
రాజాభయ్యా చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో భన్విసింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు. ఎన్ని వేధింపులు ఎదురైనా వివాహబంధాన్ని కాపాడుకునేందుకు తొలుత చట్టపరమైన చర్యలకు తాను దూరంగా ఉన్నానని, అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు.
బన్వి సింగ్ గతంలోనూ ఇవే ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్, ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటీని ఆశ్రయించారు. రాజ్యభయ్యా ముఫ్పై ఏళ్లుగా గృహహింసకు పాల్పడుతున్నారంటూ 2023 ఆగస్టులో ఆమె ఒక అఫిడవిట్‌ను ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసినట్టు కూడా చెబుతున్నారు. కాగా, రాజా భయ్యా కుందా నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో జనసత్తా దల్ లోక్‌తాంత్రిక్ పార్టీని స్థాపించారు.
ఇవి కూడా చదవండి
Bihar Assembly Elections: నితీష్‌కు ఎన్నికల ఆఫర్‌పై తేజస్వి ఎంతమాట అన్నారంటే..?
California Hindu Temple: కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దాడి.. భారత్ ఖండన
Muralitharan alloted Land in Kashmir: స్పిన్ లెజెండ్ మురళీధరన్‌కు కశ్మీర్‌లో ఫ్రీగా భూమి కేటాయించారా?
Gold Smuggling Case: రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.