తెలంగాణలో బస్సు ద్వారా వైద్య సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-06-03T21:41:47+05:30 IST
తెలంగాణలో సరికొత్త వైద్య సేవకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరోనా నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా...

హైదరాబాద్: తెలంగాణలో సరికొత్త వైద్య సేవకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరోనా నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యేలా అడుగులు వేసింది. ఇక నుంచి బస్సు ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించనుంది. గురువారం మెడికల్ యూనిట్ ప్రాజెక్ట్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌పై ఈ బస్సులకు మంత్రి కేటీఆర్ జెండా ఊపి వైద్య సేవలు ప్రారంభించారు. మొదటి విడతలో 32 బస్సులను ప్రారంభించారు. రెండో విడతలో 30 బస్సులను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ మెడికల్ యూనిట్లు వెళతాయని తెలిపారు. 8 ఐసీయూ బెడ్లు, ఒక డాక్టర్, ఇద్దరు సిబ్బంది ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు.