గోపీచంద్‌ అకాడమీకి సింధు దూరం!

ABN , First Publish Date - 2021-02-15T07:25:42+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తుండడంతో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తన సన్నాహకాలకు పదును పెట్టింది. ఒలింపిక్స్‌ వేదికలో ఆడుతున్న అనుభూతి కలిగేందుకు...

గోపీచంద్‌ అకాడమీకి సింధు దూరం!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తుండడంతో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తన సన్నాహకాలకు పదును పెట్టింది. ఒలింపిక్స్‌ వేదికలో ఆడుతున్న అనుభూతి కలిగేందుకు మంగళవారం నుంచి గచ్చిబౌలి స్టేడియంలో సింధు సాధన ప్రారంభించనుందని ఆమె తండ్రి పీవీ రమణ చెప్పారు. దీంతో గోపీ అకాడమీకి సింధు పూర్తిగా దూరమైనట్టేనన్న వార్తలు వినిపి స్తున్నాయి. ‘అకాడమీ వాతావరణంలో కాకుండా స్టేడియంలో సాధన చేస్తే సింధు మానసికంగా దృఢంగా తయారవు తుంది. 


ఇందుకు సాయ్‌, బాయ్‌ నుంచి సింధు అనుమతి తీసుకొంది. కొరియా కోచ్‌ పార్క్‌ టి సాంగ్‌ పర్యవేక్షణలో సింధు సాధన చేయనుంది’ అని రమణ తెలిపారు. గోపీతో విభేదాలు లేవని, ప్రపంచస్థాయి వేదికలో సాధన చేసేందుకే సింధు ఈ నిర్ణయం తీసుకుందని రమణ అన్నారు. 

Updated Date - 2021-02-15T07:25:42+05:30 IST