తుపాను ? తుపాను ?
ABN , First Publish Date - 2020-05-14T20:41:54+05:30 IST
తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు... శనివారం నాటికి తుపాను ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 15 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఆ తర్వాత మరింత బలపడి 16 వ తేదీ నాటికి తుఫాన్‌గా మారనుంది.

విశాఖపట్నం : తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు... శనివారం నాటికి తుపాను ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 15 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. ఆ తర్వాత మరింత బలపడి 16 వ తేదీ నాటికి తుఫాన్‌గా మారనుంది.
ఈ క్రమంలో... సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, వేటలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని అధకారులు ఇప్పటికే హెచ్చరించారు.
తుఫాన్ కారణంగా అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణం అనుకూలంగా మారే అవకాశముంటుంది. తుఫాన్‌తో కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి. వర్షాలకు అవకాశం ఉండదు