వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికుల ధర్నా
ABN , First Publish Date - 2020-12-29T06:21:53+05:30 IST
వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికుల ధర్నా

చాట్రాయి: పాఠశాలలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమకు 15 నెలల జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఎంఈవో ఆఫీస్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య, పరికల కళావతి, ఆనందరావు, చాట్ల కుమారి, అంజమ్మ, మారయ్య పాల్గొన్నారు
నందిగామలో భిక్షాటన
నందిగామ రూరల్: నగర పంచాయతీ కార్మికుల సమ్మెబాట సోమవారం ఎనిమిదో రోజుకు చేరింది. కార్మిక సంఘ నాయకుడు కటారపు గోపాల్ ఆధ్వర్యంలో మెయిన్ బజార్‌లో షాపుల వద్ద కార్మికులు భిక్షాటన చేసి, నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిరసన ప్రదర్శన చేశారు. నరేష్, సైదా, పిచ్చయ్య, ప్రసాద్, బేబి, చిన్నమ్మాయ్, రాజారత్నం పాల్గొన్నారు.