పీవీ మనవాడు.. : సోనియా గాంధీ
ABN , First Publish Date - 2020-07-24T22:25:18+05:30 IST
‘దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మన వాడు, పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం’ అని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో కాంగ్రెస్

న్యూఢిల్లీ: ‘దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మన వాడు, పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం’ అని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ శత జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాందీ వీడియో ద్వారా సందేశాన్ని పంపారు. పీవీ ఘనకీర్తిని కొనియాడారు. పీవీ నరసింహారవు శత జయంతి వేడుకలను పార్టీ ఏడాది పాటు నిర్వహిస్తోందని చెప్పారు. పీవీ గురించి ఎవరు వేడుకలు నిర్వహించిన స్వాగతిస్తామని సోనియా చెప్పారు. పీవీ స్ఫూర్తితో పని చేసి 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియా విశ్వాసం వ్యక్తం చేశారు.