Telangana: బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:20 PM
తెలంగాణ రాజకీయాలను చూస్తే తన చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్న పాఠం గుర్తుకు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డి పద్ధతి, పనితీరు ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ నాట్ కర్షప్ట్ ఇండివిజువల్స్ కరప్ట్ అన్న విధంగా ఉందంటూ..

హైదరాబాద్, ఏప్రిల్ 10: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందన్న ఆయన.. దీనికి రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్.. తెలంగాణ రాజకీయాలను చూస్తే తన చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్న పాఠం గుర్తుకు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డి పద్ధతి, పనితీరు ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ నాట్ కర్షప్ట్ ఇండివిజువల్స్ కరప్ట్ అన్న విధంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఈ సూత్రం సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ బీజేపీకి సరిగ్గా వర్తిస్తుందన్నారు.
తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడం నీ వల్ల కాదు కదా.. నీ బాస్ రాహుల్ గాంధీ వల్ల కూడా కాదంటూ సీఎ రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వము అన్నంత ఈజీగా కాదన్నారు. తన రెండు అడుగులు చాలు.. తెలంగాణలో బీజేపీ ఉందని చెప్పడానికి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాడమనే అంశం తమ పార్టీ నేతల చేతిలోనే ఉందన్న ఎంపీ.. ఇందుకు రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు ఉన్న దమ్ము ధైర్యం నీకు లేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ప్రశ్నించారు. నిన్ను జైల్లో వేసిన వారిని ఎందుకు జైలుకు పంపలేకపోతున్నావ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రికి రోషం, పౌరుషం లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనా ఎంపీ అరవింద్ విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఓ బచ్చా అని.. అతను ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదని వ్యాఖ్యానించారు. హెచ్‌సీయూ భూములన కబ్జా చేసిన బీజేపీ ఎంపీ ఎవరో దమ్ముంటే బయటపెట్టాలని కేటీఆర్‌కు ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కంటే అత్యంత ప్రమాదకారి అని.. హైదరాబాద్‌ను బేస్‌మెంట్‌త సహా కూల్చివేయడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
Also Read:
సింగరేణి కార్మికులకు డ్రెస్ కోడ్..!
మర్డర్ కేసు సాక్షితో సినిమా చూసిన దర్శన్
For More Telangana News and Telugu News..