వైభవంగా పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-15T06:13:22+05:30 IST

కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు వైభవోపే తంగా ప్రారంభమయ్యాయి.

వైభవంగా పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం

కైకలూరు, మార్చి 14 : కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు వైభవోపే తంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. సారెను అందజేశారు.  రాష్ట్ర వడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ సైదు గాయత్రి సంతోషి, వైసీపీ నాయకుడు ముంగర నరసింహారావు, ఉత్సవ కమిటీ సభ్యులు పులవర్తి లక్ష్మణ్‌, గోకర్ణేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్‌ సి.హెచ్‌.హనుమంతరాజు, గ్రామ సర్పంచ్‌ బలే వెంకటరమణ, సీఐ వై.వి.ఎల్‌.నాయుడు, ఎస్సై టి. రామకృష్ణ, ఈవో కె.వి.గోపాలరావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-15T06:13:22+05:30 IST