పోలీసుల అదుపులో ఎర్రచందనం దొంగలు
ABN , First Publish Date - 2021-08-25T00:03:08+05:30 IST
నలుగురు ఎర్రచందనం దొంగలను పోలీసులు అదుపులోకి
తిరుమల: నలుగురు ఎర్రచందనం దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్ర చందనం దొంగలను ఫేస్ రికగ్నజైడ్ కెమెరాలు పట్టించాయి. అటవీ మార్గంలో దారితప్పి శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉన్న మ్యూజియం వద్దకు ఎర్రచందనం దొంగలు వచ్చారు. సీసీ కెమెరాలు అలెర్ట్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై, దగ్గర్లోని భద్రతా సిబ్బందిని సెంట్రల్ కమాండ్ అలెర్ట్ చేసింది. వెంటనే దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.