మార్కెట్లోకి సరికొత్త ఆడి క్యూ5
ABN , First Publish Date - 2021-11-24T09:01:46+05:30 IST
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఎస్యూవీ క్యూ5 కారును మార్కెట్లో విడుదల చేసింది. ..
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఎస్యూవీ క్యూ5 కారును మార్కెట్లో విడుదల చేసింది. ఐదు సీట్లతో కూడిన ఈ కారు టెక్నాలజీ, ప్రీమియం ప్లస్ పేరిట రెండు వేరియెంట్లలో అందుబాటులో ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ వెల్లడించారు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధరలు వరుసగా రూ.63.77 లక్షలు, రూ.58.93 లక్షలుగా ఉన్నాయి. ఈ ఏడాది ఆడి కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన తొమ్మిదో వాహనం ఇది. 2.0 లీటర్ల టీఎ్ఫఎ్సఐ ఇంజన్, పార్క్ అసిస్ట్, కంఫర్ట్ కీ, ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, 19 స్పీకర్ బీఓ ప్రీమియం 3డి సౌండ్ సిస్టమ్, ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఈ ఎస్యూవీ ప్రత్యేకతలు.