తెరుచుకోనున్న శబరిమల ఆలయం
ABN , First Publish Date - 2021-07-11T01:20:29+05:30 IST
కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మాస పూజల కోసం..

తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మాస పూజల కోసం తెరుచుకోనుంది. ఈనెల 17 నుంచి 21 వరకూ ఆలయాన్ని భక్తుల సందర్శనార్ధం తెరుస్తున్నట్టు దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు కానీ, 48 గంటల్లోపు జారీ చేసిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కానీ తెచ్చుకోవాలని, అప్పుడే వారిని ఆలయ ప్రవేశం కల్పిస్తామని తెలిపింది. ఆన్లైన్ బుకింగ్ పద్ధతిలో గరిష్టంగా 5,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది.