మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత... బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
ABN , First Publish Date - 2021-11-15T23:34:40+05:30 IST
మిర్యాలగూడ పట్టణ శివారులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై...

నల్లగొండ: మిర్యాలగూడ పట్టణ శివారులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అంతేకాదు బండి సంజయ్‌పై కూడా దాడి చేసేందుకు యత్నించారు. బండి సంజయ్ కాన్వాయ్‌ను అడుగడుగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అతి కష్టం మీద బండి సంజయ్ కాన్వాయ్‌ను పోలీసులు అక్కడి నుంచి దాటించారు.