‘షర్మిలకు మద్దతిస్తున్నామని అన్నల పేరిట లెటర్ చూశాం’
ABN , First Publish Date - 2021-06-22T23:26:57+05:30 IST
‘షర్మిలకు మద్దతిస్తున్నామని అన్నల పేరిట లెటర్ చూశాం’

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో షర్మిలకు మద్దతిస్తున్నామని అన్నల పేరిట లెటర్ పేర్కొనడం చూశామని షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి తెలిపారు. షర్మిల పెట్టబోయే పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక కావాలని కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పారు. దీని వెనకున్న ఆంతర్యమేంటో ప్రభుత్వం నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధం లేకుండా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పట్ల సహించేది లేదన్నారు.