ఆయన నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు: అయ్యన్న
ABN , First Publish Date - 2022-12-13T19:20:38+05:30 IST
కోర్టులో కేసులు ఉండగా విశాఖలో పరిపాలనా రాజధాని ఎలా పెడతారు? అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ప్రశ్నించారు.
కాకినాడ: కోర్టులో కేసులు ఉండగా విశాఖలో పరిపాలనా రాజధాని ఎలా పెడతారు? అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రపంచానికి వ్యతిరేక దిశలో జగన్ (Jagan) వెళ్లవద్దని సూచించారు. అమరావతి (Amaravati)నే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించవద్దన్నారు. పవన్ (Pawankalyan) వాహనం రంగు విషయంలో ఒప్పుకోకపోవడానికి వైసీపీ (YCP) నేతలు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. గ్రీన్ కలర్‌లో 53 రకాల షేడ్స్ ఉంటాయన్నారు. పవన్ వాహనాన్ని తిరగనివ్వబోమని మంత్రి అమర్నాథ్ (Amarnath Reddy) నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.