ఎర్రచందనం దుంగల స్వాధీనం
ABN , First Publish Date - 2022-09-26T05:16:05+05:30 IST
వి.కోట మండలంలోని జవ్వునిపల్లె క్రాస్ వద్ద వ్యాన్‌లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన తొమ్మిదిమంది కూలీల కు అరెస్టు చేసినట్లు సీఐ ప్రసాద్‌బాబు తెలి పారు.

తొమ్మిదిమంది నిందితుల అరెస్టు
వి.కోట, సెప్టెంబరు 25: మండలంలోని జవ్వునిపల్లె క్రాస్ వద్ద వ్యాన్‌లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన తొమ్మిదిమంది కూలీల కు అరెస్టు చేసినట్లు సీఐ ప్రసాద్‌బాబు తెలి పారు. జవ్వునిపల్లె క్రాస్ నాకాబందీ నిర్వహి స్తుండగా అటుగా వచ్చిన వ్యాన్‌ను తనిఖీ చేయగా 18 ఎర్రచందనం దుంగలు బయట పడ్డాయన్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువ ణ్ణామలై జిల్లాకు చెందిన గజేంద్రన్, ఇళయ రాజా, భాగ్యరాజ్, స్వామినాథన్, మాదికుమార్, చిన్నదురై, చక్రవర్తి, ఏలుమలై, చక్రమునిని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన 594 కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
