బీచ్ మృతుల కుటుంబాలపై కనికరం చూపని ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-10-19T05:51:06+05:30 IST
సూర్యలంక బీచ్‌లో ఆరుగురు యువకులు మృత్యువాతపడినా వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు

బీచ్ మృతుల కుటుంబాలపై కనికరం చూపని ఎమ్మెల్యే
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు
పాయకాపురం, అక్టోబరు 18 : సూర్యలంక బీచ్‌లో ఆరుగురు యువకులు మృత్యువాతపడినా వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. బీచ్‌లో మృతి చెందిన యువకుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతూ మంగళవారం సీపీఎం నేతలు శాంతినగర్ ప్రాంతంలో నిరసన నిర్వహించి ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇచ్చే విషయంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసి స్థానికుల మద్దతు కోరుతున్నామన్నారు. ఎన్నికల ముందు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని చెప్పిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఆరు కుటుంబాల ఘోష వినపడటం లేదా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. నేతలు బి. రమణారావు, సీహెచ్. శ్రీనివాస్, పీర్ సాహెబ్, సుజాత, పార్వతి, పాల్గొన్నారు.